మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 01:37:42

నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంనుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఉదయం 11గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి బీఏసీ సమావేశం కానుంది. ఈ నెల 8న (ఆదివారం) ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దీనిపై శాసనసభ బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉండగా.. అసెంబ్లీ సమావేశాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బడ్జెట్‌పై ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షించారు. ఆర్థికశాఖ అధికారులకు పలు సూచనలు జారీచేశారు. మొత్తం 14 పనిదినాలకు తగ్గకుండా సమావేశాలు జరుగనున్నాయి. ఎన్నిరోజులు, ఎన్నిగంటలపాటు సమావేశాలుండాలన్నది కూడా బీఏసీ నిర్ణయించనున్నది. 


logo
>>>>>>