గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 11:16:06

టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం

టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం

పెద్దపల్లి : జిల్లా లోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నిదానపురం దేవయ్య పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు గన్నుతో హత్యా ప్రయత్నం చేశారు. చాకచక్యంగా దేవయ్య వారి వద్ద ఉన్న గన్ను లాక్కొని విసిరి పారేసి అరవడంతో దుండగులు పారిపోయారని బాధితుడు తెలిపాడు. దేవయ్య గతంలో పీపుల్స్ వార్ పార్టీలో మిలిటెంట్ గా పని చేశారు. కాల్వ శ్రీరాంపూర్ లో భూవివాదంలో దేవయ్యకు మరో వ్యక్తితో వివాదం ఉంది. కాగా, వచ్చింది మావోయిస్టు యాక్షన్ టీమా లేక భూవివాదం ఉన్న వ్యక్తులా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.     


logo