ప్రచారం
శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతే ఆక్సిజన్ సిలిండర్లు అక్కర్లేదు. హోమియో మందు ‘ఆస్పిడోస్పెర్మా క్యూ’ 20 చుక్కలను ఒక కప్పు నీటిలో కలుపుకొని తాగాలి. శరీరంలో ఆక్సిజన్ సాధారణ స్థాయికి వస్తుంది. ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
వాస్తవం
ఆస్పిడోస్పెర్మా క్యూ ఔషధాన్ని ఆస్థమాతో బాధపడేవారికి, కొవిడ్ రోగుల్లో జ్వరం లేదా దగ్గు ఉండి ఊపిరి తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది ఉంటే వాడుతారు. ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరు స్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొద్దిగా పెంచుతుంది. అయితే దవాఖానలో ఆక్సిజన్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు. దవాఖానలో రోగికి ఆక్సిజన్ ఎక్కించినంత వేగంగా ఈ ఔషధం పెంచలేదు. ఆక్సిజన్ స్థాయి బాగా తగ్గితే వెంటనే దవాఖానకు వెళ్లాలి.