గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 19:26:49

గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ : తిర్యానీ పోలీసు స్టేష‌న్ ఏఎస్ఐ సిదం దేవ్ రావు(54) గుండెపోటుతో శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. తిర్యానీ మండ‌లంలోని మాణిక్యాపూర్ గ్రామంలో వాహ‌నాల‌ను త‌నిఖీలు చేస్తుండ‌గా ఏఎస్ఐ కుప్ప‌కూలిపోయాడు. దీంతో ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గుండెపోటుతో అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవ‌ల త‌ప్పించుకున్న మావోయిస్టుల‌ను గుర్తించే బృందంలో ఏఎస్ఐ ఉన్నారు. 

ఏఎస్ఐ మృతిప‌ట్ల తిర్యానీ ఎస్ఐ పీ రామ‌రావుతో పాటు పోలీసులు సంతాపం తెలిపారు. ఏఎస్ఐ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. దేవ‌రావు కుటుంబానికి పోలీసు డిపార్ట్ మెంట్ అండ‌గా ఉంటుంద‌ని ఎస్ఐ పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహ‌త్నూర మండ‌లం శాంతాపూర్ గ్రామానికి చెందిన దేవ‌రావు.. 1989లో పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 


logo