శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 02:20:08

కరోనాతో ఏఆర్‌ ఏఎస్సై మృతి

కరోనాతో ఏఆర్‌ ఏఎస్సై మృతి

వేములవాడ, జనవరి 9: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గాంధీనగర్‌కు చెందిన ఏఆర్‌ ఏఎస్సై అన్నారం కనుకయ్య(51) కరోనా తో శనివారం తెల్లవారుజూమున మరణించారు. కనుకయ్య రాజన్న ఆలయంలో హోంగార్డు ఇం చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇరవై రోజుల కిందట తీవ్ర జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనుకయ్య మరణంతో పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.