గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:40:15

మొండికిపోతే బలవుతాం

మొండికిపోతే బలవుతాం

  • కరోనావ్యాప్తిపై అసదుద్దీన్‌ హెచ్చరిక
  • ఇంట్లో నమాజు చేసుకోవాలని సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రాణాలను కబళిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇండ్లనుంచి ఎవరూ బయటకురావద్దని మజ్లిస్‌  అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు. సామూహికంగా కాకుండా ఇండ్లలో నమాజు చేసుకోవాలని శుక్రవారం వీడియో సందేశంలో కోరారు. కరోనా వ్యాప్తిని నిరోధించాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉన్నదన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని, మొండికిపోతే బలవుతారని హెచ్చరించారు. కేంద్రం  వైఖరిపై వ్యతిరేకత ఉన్నదని, కరోనాను తరిమికొట్టిన తర్వాత రాజకీయాలు చూసుకుందామని పేర్కొన్నారు. 


logo