శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 18:46:35

కరోనా బాధితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు : అసదుద్దీన్‌

కరోనా బాధితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు : అసదుద్దీన్‌

హైదరాబాద్‌ : కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై జరిగిన దాడి విషయంలో ఏఐఎంఐఎం ప్రెసిడిండ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. వైద్య సిబ్బందిపై దాడి సరి కాదని, కొవిడ్‌-19 బాధితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.

కరోనా రోగులకు సేవలందిస్తూ గాంధీ, ఇతర ఆసుపత్రుల్లో పని చేస్తున్న అటెండర్లు, వైద్య సిబ్బందిపై దాడి చేయకూడదని అన్నారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను గౌరవించాలని అన్నారు. ఆరోగ్య సిబ్బందిపై ఏమైనా ఫిర్యాదులుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.


logo