బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 00:53:23

చైనాను ఎందుకు నమ్ముతున్నారు? కేంద్రానికి ఒవైసీ ప్రశ్న

చైనాను ఎందుకు నమ్ముతున్నారు? కేంద్రానికి ఒవైసీ ప్రశ్న

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారత భూభాగాలను ఆక్రమించాలని చూస్తున్న చైనాను ఎందుకు నమ్ముతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. సరిహద్దుల్లోని బలగాలను వెనక్కి తీసుకోనున్నట్టు ఇరు దేశాలు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రానికి అసదుద్దీన్‌ మూడు ప్రశ్నలు సంధించారు. 

1. ఉద్రిక్తతల తగ్గింపు అంటే ‘చైనా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు’ అన్నట్టుగా వదిలేయడమా?  

2. దేశంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని ఇటీవలే ప్రకటించారు. అలాంటప్పుడు బలగాలను వెనక్కి తీసుకోవడం ఎందుకు? 

3. జూన్‌ 6న కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన చైనాను ఇంకా ఎందుకు నమ్ముతున్నారు?  అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.


logo