గురువారం 21 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 15:33:55

మోదీని తీసుకొచ్చి.. పాతబ‌స్తీలో ప్ర‌చారం చేయించండి చూద్దాం!

మోదీని తీసుకొచ్చి.. పాతబ‌స్తీలో ప్ర‌చారం చేయించండి చూద్దాం!

హైద‌రాబాద్‌:  బీజేపీ నేత‌ల‌కు స‌వాలు విసిరారు ఎంఐఎం అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ. న‌రేంద్ర మోదీని తీసుకొచ్చి పాత‌బ‌స్తీలో ప్ర‌చారం చేయించండ‌ని అడిగారు. మీరు మోదీని తీసుకొచ్చి పాత‌బ‌స్తీలో ప్ర‌చారం చేయించండి. ఏం జ‌రుగుతుందో చూద్దాం. ఆయ‌న‌తో ఓ స‌భ నిర్వ‌హించండి. మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం అని అస‌ద్ స‌వాలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కోసం కేంద్ర‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రుల‌ను బీజేపీ రంగంలోకి దింపుతుండ‌టంతో అస‌ద్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇవి మున్సిప‌ల్ ఎన్నిక‌లు. వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడ‌రు. హైద‌రాబాద్ బాగా అభివృద్ధి చెందింది. ఎన్నో ఎంఎన్‌సీలు ఇక్క‌డికి వ‌చ్చాయి. కానీ బీజేపీ దానిని నాశ‌నం చేయాల‌ని చూస్తోంది అని అస‌ద్ ఆరోపించారు. పాత‌బ‌స్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు ఉన్నారన్న ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ.. దీనికి ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షానే బాధ్యుల‌ని అన్నారు. పాకిస్తానీలు చొర‌బ‌డుతుంటే వాళ్లు నిద్ర‌పోతున్నారా?  వాళ్ల‌ను నేనెప్పుడూ ఇక్కడ చూడ‌లేదు. వాళ్లు హిందూ, ముస్లింల మ‌ధ్య విద్వేష‌పు గోడ‌ను నిర్మించాల‌ని వాళ్లు భావిస్తున్నారు అని అస‌ద్ విమ‌ర్శించారు. 


logo