శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 21:47:36

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసల జోరు

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసల జోరు

నిజామాబాద్ ‌: నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరుగు కొనసాగుతున్నది. ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రేండ్ల రవితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ జనరంజక పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రెసిడెంట్‌ పూర్ణానందం, ఎంపీటీసీ జక్కని మధు, సర్పంచ్‌ లావణ్య, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ ఎంపీటీసీలు..

మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్‌ కోటగిరి లక్ష్మి (బీజేపీ), గుంజిలి ఎంపీటీసీ సుజాత(కాంగ్రెస్‌), గొట్టుముక్కల ఎంపీటీసీ సత్యగంగు(బీజేపీ) హైదరాబాద్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ రజినీశ్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి ఎంపీటీసీ సంత్యలి చంద్రునాయక్‌ (కాంగ్రెస్‌) జిల్లా కేంద్రంలోప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.   

టీఆర్‌ఎస్‌లోకి మరో వార్డు కౌన్సిలర్‌

కామారెడ్డి పట్టణ 23వ వార్డు కౌన్సిలర్‌ తేజపు మానస (కాంగ్రెస్‌) ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విప్‌ గంప గోవర్ధన్‌ నివాసంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.
logo