మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 02:25:00

ఇటలీలో పరిస్థితులు దారుణం

ఇటలీలో పరిస్థితులు దారుణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతో ఇటలీలో ఎంఎస్‌ పూర్తిచేశాను. ఇటలీలోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ కరోనా వైరస్‌ అల్లకల్లోలం చేస్తున్నది. రహదారులన్నీ నిర్మానుషంగా మారాయి. భారత్‌లో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రజలు స్వీయనియంత్రణ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ముందుజాగ్రత్త చర్యలు అభినందనీయం. 

- ఇటలీలోని మిలాన్‌లో ఉన్న కరీంనగర్‌ జిల్లా రేకుర్తి గ్రామవాసి సంధ్యారాణి (ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బీ వినోద్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు.)logo
>>>>>>