ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 00:45:09

ఏపీ సీజేగా అరూప్‌గోస్వామి ప్రమాణం

ఏపీ సీజేగా అరూప్‌గోస్వామి ప్రమాణం

హైదరాబాద్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బుధవారం ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్‌ గోస్వామితో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌సహా పలువురు న్యాయమూర్తులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.