గురువారం 09 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 11:09:50

ఆరుద్ర వచ్చింది.. ఆనందాలు మోసుకొచ్చింది

ఆరుద్ర వచ్చింది.. ఆనందాలు మోసుకొచ్చింది

పెద్దపల్లి : ఆరుద్ర కార్తెకు, రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా, బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. 

ఆరుద్ర కార్తె రానే వచ్చింది. దానికి సూచికగా తెలంగాణ నేలలపై ఆరుద్ర కనువిందు చేస్తున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కెపూర్ పంట పొలాల్లో గురువారం ఇలా ఆరుద్ర దర్శనం ఇవ్వడంతో రైతులు శుభసూచకంగా భావించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు.

ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం. మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు, రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్య కాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది.logo