శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 21:19:51

వేటగాళ్ల అరెస్ట్‌

వేటగాళ్ల అరెస్ట్‌

అశ్వారావుపేట: అడవిలో వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురిని అటవీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన కొర్రి రామకృష్ణ, తెల్లం ముక్కయ్య, దాట్ల రామకృష్ణ సమీపంలోని అటవీప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్నారు. పెట్రోలింగ్ లో ఉన్న ఇన్‌చార్జి రేంజర్ అబ్దుల్ రెహ్మాన్ సమాచారం తెలుసుకుని నిఘా వేశారు. వేటాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నాటు తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  


logo