ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 18:13:54

ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌... వివరాలు వెల్లడించిన ఏఎస్సీ శబరీష్‌

ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌... వివరాలు వెల్లడించిన ఏఎస్సీ శబరీష్‌

భద్రాద్రి కొత్తగూడెం :  జిల్లాలోని పినపాక డివిజన్‌ కరకగూడెం పరిధిలోని రఘునాథపాలెం- గొల్లగూడెం అటవీప్రాంతంలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌ చేసినట్లు ఏఎస్పీ శబరీష్‌ తెలిపారు. ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కరకగూడెం పోలీసులు రఘునాథపాలెం-గొల్లగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా, పోలబోయిన వెంకటేశ్వర్లు(సమ్మయ్య) రఘునాథపాలెం, పులిసమ్మయ్య, పోలబోయిన వెంకటయ్య, పాయం రాంబాబు, ఇర్ఫా వెంకటేశ్వర్లు అనుమానాస్పదంగా కనిపించారు. 

వారిని విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా కమిటీ సెక్రటరీ ఆజాద్‌, మణుగూరు ఏరియా కమిటీ మావోయిస్టు నేతల సూచన మేరకు పోలీసులను హతమార్చేందుకు పేలుడు పదార్థాలను అమర్చేందుకు వెళ్తున్నట్లు అంగీకరించారు. వీరి నుంచి 10 జిలెటిన్‌ స్టిక్స్‌, 50మీటర్ల వైరు, రెండు టిఫిన్‌బాక్స్‌లు, మూడు డిటోనేటర్లు, ఆరు 1.5 వాల్ట్స్‌ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.