శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 19:40:23

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి

యూపీఎస్సీ ప్రిలిమినరీ  పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి

వరంగల్ అర్బన్  : వచ్చే నెల 4న జరిగే యూపీఎస్సీ ప్రిలిమినరీ  పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యూపీఎస్సీ సెక్రటరీ  సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ కోసం.. మార్గ దర్శకాలు గుర్తించిన ఆయా  జిల్లాల సంబంధిత జిల్లా కలెక్టర్ లతో న్యూ ఢిల్లీ నుంచి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ..  జిల్లాలో 6,763 మంది పరీక్షలకు హాజరయ్యే వారి కోసం 16 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రథమ చికిత్స, బందోబస్తు, లోపల లైటింగ్  ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.  ప్రతి సెంటర్ కు సూపర్వైజర్ అధికారులను నియమించినట్లు  చెప్పారు.  ప్రిలిమినరీ సెక్రటరీ వసుధ మిశ్రా  మాట్లాడుతూ.. పరీక్షల కోసం  పకడ్బందీ  ఏర్పాట్లు చేయాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉంటుందన్నారు.


అక్టోబర్ 4 వ తేదీన మొదటి పేపర్  ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో పేపర్  మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు  ఉంటుందని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ తో పాటు డీసీపీ పుష్ప,డీఅర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో వాసు చంద్ర,  కలక్టరేట్ ఏవో విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.          ,          


               logo