e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home తెలంగాణ మొహర్రానికి ప్రభుత్వ ఏర్పాట్లు

మొహర్రానికి ప్రభుత్వ ఏర్పాట్లు

మంత్రులు మహమూద్‌అలీ, కొప్పుల ఈశ్వర్‌ సమీక్ష
హైదరాబాద్‌, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మొహర్రం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌ భవన్‌లో మత పెద్దలు, సంబంధిత అధికారులతో మొహర్రం నిర్వహణ, ఏర్పాట్ల అంశాలపై ఆదివారం మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గతేడాది వేడుకలను నిర్వహించలేకపోయామని తెలిపారు. ఈ ఏడాది ఎలాంటి నిషేధం విధించకున్నా కొన్ని పరిమితులకు లోబడి వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. పోలీస్‌, హెల్త్‌, విద్యుత్తు, మున్సిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొహర్రం నిర్వహణ బడ్జెట్‌ను రూ.50 లక్షలకు పెంచుతున్నట్టు వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ మహ్మద్‌ సలీమ్‌ ప్రకటించారు. సమావేశంలో యాకుత్‌పుర ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ రియాజ్‌ ఉల్‌ హుస్సేన్‌, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌ నదీమ్‌, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవో షనావాజ్‌ ఖాసీం, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ హనీఫ్‌ అలీ, స్టేట్‌ వక్ఫ్‌ బోర్డు మెంబర్‌ డాక్టర్‌ నిసార్‌ అఘా, షియా ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana