బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 16:25:05

ఈ రోజు గాంధీ నుంచి ఇద్దరు డిశ్చార్జ్‌ : మంత్రి ఈటల

ఈ రోజు గాంధీ నుంచి ఇద్దరు డిశ్చార్జ్‌ : మంత్రి ఈటల

హైదరాబాద్‌:  'కరోనా మహమ్మారి కట్టడికి దేశంలో పకడ్బందీగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట కోరింది సీఎం కేసీఆరే. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించింది కూడా తెలంగాణేనని' మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో  తెలంగాణలో కరోనా కట్టడి, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల మాట్లాడారు. 

'మర్కజ్‌ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది తెలంగాణే. అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి పాజిటివ్‌ వచ్చింది. దేశానికి  తెలంగాణ దిక్సూచి. వెయ్యి మందికి పైగా మర్కజ్‌ వెళ్లినట్లు తెలిసింది. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి పరీక్షలు చేస్తున్నమంటే తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు గాంధీ ఆస్పత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జ్‌ అయిన వారు మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు చనిపోయారని' మంత్రి వివరించారు. 


logo