బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:32:58

జవాన్‌ శ్రీనివాస్‌ అంత్యక్రియలు పూర్తి

జవాన్‌ శ్రీనివాస్‌ అంత్యక్రియలు పూర్తి

రామగిరి: జమ్ముకశ్మీర్‌లోని సైనిక సెక్టార్‌లో మృతిచెందిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లికి చెందిన జవాన్‌ సాలిగాం శ్రీనివాస్‌కు గ్రామస్థులుకన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీనివాస్‌ పార్థివదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు భోరున విలపించారు. మండల సరిహద్దు మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి కల్వచర్లకు అంబులెన్స్‌ చేరుకోగానే, గ్రామస్థులు స్నేహితులు పెద్దసంఖ్యలో చేరుకొని ర్యాలీగా స్వగ్రామానికి తీసుకొని వచ్చారు. ఇంటి దగ్గర కుటుంబసభ్యులు, సన్నిహితులు శ్రీనివాస్‌ భౌతికదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అంతిమ వీడ్కోలు పలికి గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీనివాస్‌ మృతికి సంతాపం తెలిపారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆర్మీ సుబేదార్‌ స్వామినాథం నివాళి అర్పించారు.


logo