శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 19:46:33

ఇకపై రెండు ఆయుధాలకే అనుమతి

 ఇకపై రెండు ఆయుధాలకే అనుమతి

హైదరాబాద్‌: ఇకపై ఒక్కో వ్యక్తి వద్ద రెండు ఆయుధాలకు మించి ఉండకూడదని, రెండుకు మించి ఉన్నవారు వాటిని స్వాధీనపర్చాలని పోలీసులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం  ఇటీవల ఆయుధాల చట్టం, 1959 లోని సెక్షన్‌ 3 కు సవరణలు చేసి ఒక వ్యక్తి వద్ద మూడు ఆయుధాల పరిమితిని రెండుకు తగ్గించింది. ప్రస్తుతం ఉన్న మూడు ఆయుధాల పరిమితిని ఆయుధ చట్టానికి సవరణల ద్వారా 1983లో ప్రవేశపెట్టారు. 

స్వీయరక్షణ కోసం గరిష్ఠంగా రెండు ఆయుధాలు మాత్రమే పోలీసులు అనుమతిస్తారు. మూడవ ఆయుధాన్ని విక్రయించేందుకు ఒక ఏడాది సమయం అనుమతి ఇస్తామని కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా రెండు ఆయుధాలకన్నా ఎక్కువ ఆయుధాలు కలిగి వున్నట్లయితే వారు భారత ఆయుధాల చట్టం, 1959 ప్రకారం శిక్షార్హులని ఆయన పేర్కొన్నారు.logo