ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 09:15:19

భ‌ద్రాద్రి రామ‌య్య స‌న్నిధిలో ఆర్జిత సేవ‌లు ప్రారంభం

భ‌ద్రాద్రి రామ‌య్య స‌న్నిధిలో ఆర్జిత సేవ‌లు ప్రారంభం

భ‌ద్రాద్రి: భ‌ద్రాచ‌ల శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారి దేవ‌స్థానంలో ఆర్జిత సేవ‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నేప‌థ్యంలో ఇన్నాళ్లు స్వామివారి పూజ‌ల‌కు భ‌క్తుల‌ను అధికారులు అనుమ‌తించ‌లేదు. అయితే నేటి నుంచి ఆర్జిత సేవ‌లు మ‌ళ్లీ ప్రారంభించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. దీంతో భ‌ద్రాద్రి రామ‌య్య స‌న్నిధిలో జ‌రిగే పూజ‌ల్లో భ‌క్తులు నేరుగా పాల్గొనేందుకు అనుమ‌తిస్తున్నారు. నేడు ముత్తంగి అలంకారంలో భ‌క్తుల‌కు సీతారాములవారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఆర్జిత సేవ‌లు కొన‌సాగిస్తామ‌ని ఈవో శివాజీ తెలిపారు. 

భ‌క్తుల సంఖ్య‌కు అనుగుణంగా అన్ని ర‌కాల ప్ర‌సాదాలు అందుబాటులో ఉంచుతున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఆదివారం స్వామివారికి చేసే అభిషేకంలో పాల్గొనేందుకు ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమతిస్తామ‌న్నారు.


logo