గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 17:06:16

యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ చర్యల తీసుకున్నట్లు, ఆలయానికి వచ్చే భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వామివారి లఘు దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశకండనం అన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆలయ సమీపంలో గుంపులుగా ఉండకుండా సహకరించాలని కోరారు. దేశాలయానికి వచ్చిన భక్తులు, ఇక్కడ వస్తువులు అమ్మే దుకాణదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. logo