శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 21:53:03

మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా.. ఇలా చేయండి.!

మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా.. ఇలా చేయండి.!

హైదరాబాద్‌ : చాలామందికి ష్యాషన్ దుస్తులు వేసుకోవాలనే కోరిక ఉంటుంది. అయినా.. స్లీవ్ లెస్, మోకాళ్లు కనిపించే దుస్తులు వేసుకునేందుకు ఆలోచిస్తుంటారు. కారణం వారి చర్మం మొత్తం ఒక రంగులో.. మోచేతులు, మోకాళ్లు మాత్రం మరో రంగులో ఉండటమే. సాధారణంగా మిగతా భాగాలతో పోలిస్తే మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం కాస్త నల్లగా, ముడతలుగా ఉంటుంది. దీన్ని కవర్ చేసుకునేందుకు ఫ్యాషన్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని చాలామంది బాధ పడుతుంటారు. ఏవేవో క్రీములు లాంటివి ట్రై చేస్తుంటారు. పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వీటిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు చర్మ నిపుణులు. అవేంటంటే..

1. పెరుగు ‌ :పెరుగు చర్మానికి మంచి నేస్తం లాంటిది. రెండు చెంచాల పెరుగులో బాదం పొడి కలిపి.. ఆ పేస్టును నల్లగా ఉన్న చోట రాసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.

2. కొబ్బరినూనె ‌ : కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి రాసుకుంటే నల్లపు ఉన్న దగ్గర మర్ధనా చేయాలి.. తరవాత వేడినీళ్లలో క్లాత్ ముంచి తుడవాలి. ఇలా వారానికోసారి చేస్తే సమస్య తొలగిపోతుంది.

3. నిమ్మకాయ ‌ : రోజూ నిమ్మ చెక్కతో మోచేతులు, మోకాళ్ల దగ్గర రుద్దుతుండాలి. తర్వాత దాన్ని కడగటం, తుడవటం చేస్తే సరిపోతుంది.  ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మార్పు మీకే తెలుస్తుంది.

4. వాల్‌నట్ పౌడర్ ‌ : వాల్‌నట్ పొడి, కొబ్బరినూనె కలిపి పేస్ట్ తా తయారు చేయాలి.. దాన్ని రాసుకోవడం వల్ల నలుపు తగ్గడంతో పాటు చర్మం నున్నగా మారుతుంది.

5. గుడ్డు తెల్లసొన ‌ : గుడ్డులోని తెల్లసొనకు చెంచాడు పంచదార, అరచెంచా జొన్నపిండి కలిపి దానిని నల్లగా, గరుకుగా ఉన్న చోట రాసుకుని ఆరాక కడిక్కోవాలి. ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్లు మంచి రంగు వస్తుంటాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.