గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 13:19:01

కరోనాతో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి

కరోనాతో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి

నిజామాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ హమీద్‌(45) కరోనాతో మృతి చెందారు. ఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. నిజామాబాద్‌ నుంచి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మేడ్చల్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. దీంతో తిరిగి ఎస్‌ఐ మృతదేహాన్ని నిజామాబాద్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. హమీద్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హమీద్‌ మృతిపట్ల ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీసత్య శ్రీనివాస్‌ రావు సంతాపం తెలిపారు. ఎస్‌ఐ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బోధన్‌ వాస్తవ్యుడైన హమీద్‌.. 1994లో పోలీసు విభాగంలో చేరారు. 26 ఏళ్ల పాటు వివిధ స్థాయిల్లో సేవలందించారు హమీద్‌. 


logo