మంగళవారం 26 మే 2020
Telangana - May 04, 2020 , 17:43:26

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంబర్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలరాజు అనే వ్యక్తి ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పేట్లబురుజు ఏఆర్‌ విభాగంలో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆయన ప్రేమ్‌నగర్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆయన ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది.  


logo