గురువారం 09 జూలై 2020
Telangana - Feb 21, 2020 , 08:05:18

పెండ్లి చేసుకుంటానని.. లైంగికదాడి

 పెండ్లి చేసుకుంటానని.. లైంగికదాడి

మలక్‌పేట : ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు లైంగికదాడికిపాల్పడి.. మరో యువతిని పెండ్లి చేసుకున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ను మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ముంతాజ్‌ కళాశాల సమీపంలో నివసించే యువతికి.. 2018లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఫేస్‌ బుక్‌ ద్వారా ఏఆర్‌ కానిస్టేబుల్‌ శివకుమార్‌రెడ్డి(24) పరిచయం అయ్యాడు. అదే ఏడాది ఏప్రిల్‌ 10న యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా.. శివకుమార్‌రెడ్డి వచ్చి పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అలా పలుమార్లు  లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో నిత్యం చాటింగ్‌చేసే అతడి ఫోన్‌ ఇటీవల స్విచ్‌ ఆఫ్‌ అయింది. దీంతో  అనుమానం వచ్చిన యువతి అతన్ని కలిసేందుకు యత్నించింది. ఈ క్రమంలో జనవరి 14న  శివకుమార్‌రెడ్డి  యువతికి ఫోన్‌చేసి.. తాను తప్పనిసరి పరిస్థితుల్లో మరో యువతిని పెండ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో బాధిత యువతి  మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


logo