బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 07:04:38

తెలం‌గాణ ‘దా‌రి’‌లోకి ఏపీ!

తెలం‌గాణ ‘దా‌రి’‌లోకి ఏపీ!

హైద‌రా‌బాద్‌: అంత‌ర్రాష్ట బస్సుల పున‌రు‌ద్ధ‌ర‌ణపై ఏపీ‌ఎ‌స్‌‌ఆ‌ర్టీసీ.. తెలం‌గాణ దారి‌లోకే వస్తు‌న్నట్టు తెలు‌స్తు‌న్నది. తొలి‌నుంచి తెలం‌గాణ ఒకే ప్రతి‌పా‌ద‌నకు కట్టు‌బడి ఉండగా.. ఏపీ‌ఎ‌స్‌‌ఆ‌ర్టీసీ వివి‌ధ‌ర‌కా‌లుగా టీఎ‌స్‌‌ఆ‌ర్టీసీ కిలో‌మీ‌ట‌ర్లను పెంచేం‌దుకు ప్రయ‌త్నిం‌చింది. కానీ, సఫలం కాక‌పో‌వ‌డంతో తెలం‌గాణ ప్రతి‌పా‌ద‌నకు ఓకే చెప్పా‌లని నిర్ణ‌యిం‌చి‌నట్టు సమా‌చారం. ఏపీ‌ఎ‌స్‌‌ఆ‌ర్టీసీ కూడా తెలం‌గాణ మాది‌రిగా హైద‌రా‌బాద్‌– విజ‌య‌వాడ మార్గం‌పైనే దృష్టి సారి‌స్తు‌న్నది. లాక్‌‌డౌ‌న్‌కు ముందు హైద‌రా‌బాద్‌– విజ‌య‌వాడ మధ్య ఏపీ‌ఎ‌స్‌‌ఆ‌ర్టీసీ రోజుకు 150–160 బస్సులు నడు‌పగా.. టీఎ‌స్‌‌ఆ‌ర్టీసీ 50–60 వరకు నడి‌పేది. ప్రస్తుతం చర్చల నేప‌థ్యంలో ఏపీ‌ఎ‌స్‌‌ఆ‌ర్టీ‌సీకి ఇచ్చిన రూట్ల‌వారీ, కిలో‌మీ‌టర్ల ప్రతి‌పా‌ద‌నల్లో తెలం‌గాణ ఈ మార్గం‌లోనే ఎక్కువ బస్సులు నడి‌పేం‌దుకు ప్రాధా‌న్య‌మి‌చ్చింది.

తెలం‌గాణ ప్రతి‌పా‌దన మేరకు 1.61 లక్షల కిలో‌మీ‌టర్ల మేర బస్సులు నడి‌పేం‌దుకు ప్రణా‌ళి‌కలు సిద్ధం‌చే‌స్తున్న ఏపీ అధి‌కా‌రులు.. హైద‌రా‌బా‌ద్‌–‌వి‌జ‌య‌వాడ రూట్‌లో కిలో‌మీ‌టర్లు తగ్గిం‌చు‌కో‌వా‌లని కోరు‌తు‌న్నట్టు తెలి‌సింది. 1.61 లక్షల కిలో‌మీ‌టర్లు పోను మిగి‌లిన లక్ష కిలో‌మీ‌ట‌ర్లకు స్టేజ్‌ క్యారి‌య‌ర్లుగా బస్సులు నడి‌పేం‌దుకు ఏపీ ప్రతి‌పా‌దిం‌చి‌నట్టు సమా‌చారం. లక్ష కిలో‌మీ‌ట‌ర్లకు త్రైమా‌సిక పన్ను చెల్లింపు ప్రాతి‌ప‌ది‌కన దాదాపు 350 బస్సులు నడు‌ప‌ను‌న్నట్టు తెలి‌సింది. ఇందుకు తెలం‌గాణ రవా‌ణా‌శా‌ఖకు రూట్ల‌వా‌రీగా ప్రతి‌పా‌ద‌నలు ఇవ్వ‌డం‌తో‌పాటు, పన్ను చెల్లిం‌చాల్సి ఉంటుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo