శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 21, 2020 , 00:53:18

ఐదు ప్రైవేటు వర్సిటీలకు ఆమోదం

ఐదు ప్రైవేటు వర్సిటీలకు ఆమోదం

  • ఫైల్‌పై సంతకం చేసిన గవర్నర్‌ తమిళిసై
  • 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. అందుకు సంబంధించిన ఫైల్‌పై బుధవారం సంతకంచేశారు. అనుమతి పొందినవాటిలో మహీంద్రా, వాక్సన్‌, మల్లారెడ్డి, ఎస్సార్‌ యూనివర్సిటీ వరంగల్‌, అనురాగ్‌ వర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించనున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల కోసం 13 విద్యాసంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో మల్లారెడ్డి, మహీంద్రా, అనురాగ్‌, వాక్సన్‌, ఎస్సార్‌ వరంగల్‌, గురునానక్‌, శ్రీనిధి, నిక్‌మర్‌, ఎంఎన్నార్‌ సంస్థలకు రాష్ట్ర విద్యాశాఖ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎన్‌వోటీ) జారీచేసింది. విజ్ఞాన్‌ రత్తయ్య, వాగ్దేవి వరంగల్‌, అమిటీ, రాడ్‌క్లిఫ్‌ సంస్థలకు అనుమతి రావాల్సి ఉన్నది. ఈ విద్యాసంస్థలు వర్సిటీలుగా మారినప్పటికీ ప్రస్తుతం వాటిల్లో చదువుతున్న విద్యార్థుల వరకు కాలేజీగానే కొనసాగుతాయి. 2020-21లో ప్రారంభమయ్యే బ్యాచ్‌లే వర్సిటీలుగా కొనసాగనున్నాయి. 



logo