ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:32:46

ఎంబీసీలకు సముచిత స్థానం : మంత్రి గంగుల

ఎంబీసీలకు సముచిత స్థానం : మంత్రి గంగుల

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కులవృత్తులకు పనిముట్లను అందించి ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎంబీసీ కులాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అన్ని బీసీ కులాల వారితో రెండు మూడు రోజులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చిస్తామని, అక్కడ వచ్చిన ప్రతిపాదనలతో నివేదికను సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌కు అందిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీసీ కులాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య,  తెలంగాణ బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బెల్లారపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేంధర్‌, కార్యదర్శి ఏ వెంకటాచారి, ఉపాధ్యక్షుడు వన్నెం శంకర్‌, కార్యదర్శి గోగుల స్వామి పాల్గొన్నారు. 


VIDEOS

logo