శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 23, 2020 , 01:00:08

అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరి

అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరని, వారికి అప్రెంటిస్‌షిప్‌ ఇవ్వడానికి దవాఖానలు, నర్సింగ్‌హోంలు ముందుకొచ్చాయని ఇంటర్‌బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు సెక్రటరీ కార్యాలయంలో కేం ద్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రాంతీయ అధికారి సహకారంతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో దవాఖానల, నర్సింగ్‌హోంల యాజమాన్యాలు పాల్గొన్నాయి. 


ఈ సందర్భగా ఒమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. అప్రెంటిస్‌షిప్‌ పొందడానికి 10 వేల మంది ఎంపీహెచ్‌ఏ (ఉమెన్‌), 9 వేల మంది మెడికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నారన్నారు. వాళ్ల వివరాలన్నీ ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, వాటిని దవాఖానల యాజమాన్యాలు నేరుగా పరిశీలించవచ్చని చెప్పారు. ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించనున్న జాబ్‌ మేళాలో ఒకేషనల్‌ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపికచేసే విధంగా చర్యలు తీసుకోవాలని దవాఖానల యాజమాన్యాలను ఆదేశించారు.  


logo