శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 14:24:42

రూ. 90 లక్షలు చోరి.. ఏటీఎంలో నగదు నింపే వ్యక్తి అరెస్టు

రూ. 90 లక్షలు చోరి.. ఏటీఎంలో నగదు నింపే వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ : ఏటీఎంల్లో నగదు నింపే ఏజెన్సీని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఎస్‌బీఐ ఏటీఎంల్లో నింపాల్సిన రూ. 90 లక్షలతో నిందితుడు ఉడాయించాడు. నిందితుడిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. నిందితుడిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దొండపాటి ప్రకాశ్‌గా గుర్తించామన్నారు. నగదు తీసుకెళ్తున్న వ్యాన్‌ డ్రైవర్‌, సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చి రూ. 90 లక్షలను దొంగిలించాడు. దీంతో 16వ తేదీన చిలకలగూడ పోలీసులకు డ్రైవర్‌, సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు 500 సీసీకెమెరాలను గుర్తించి నిందితుడిని గుర్తించారు. 28 మంది పోలీసు అధికారులు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నట్లు సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.
logo