శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 21:07:25

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఇద్ద‌రు ఇన్‌చార్జీల నియామ‌కం

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఇద్ద‌రు ఇన్‌చార్జీల నియామ‌కం

వ‌రంగ‌ల్ : ఖమ్మం-వ‌రంగ‌ల్‌-న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఇద్ద‌రు నేత‌ల‌ను ఇన్‌చార్జీలుగా నియ‌మించిన‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు తెలిపారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డిని నియ‌మించ‌గా, స్టేష‌న్ ఘన్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మ‌న్, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాంబారి స‌మ్మారావుని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే నియ‌మితులైన నేత‌ల‌తో పాటు వీరు కూడా ఇన్‌చార్జీలుగా ప‌ని చేస్తార‌ని మంత్రి తెలిపారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల ఆదేశానుసారం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. 


logo