బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 14:40:40

ఎన్నికలకు ప్రత్యేక పోలీస్‌ అధికారుల నియామకం

ఎన్నికలకు ప్రత్యేక పోలీస్‌ అధికారుల నియామకం

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఉన్నతాధికారులకు సీపీ అంజనీ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు అప్పగించారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు. స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించడంతో పాటు పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అదనపు డీజీపీ షికా గోయల్‌కు  తూర్పు జోన్‌ బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌ కుమార్‌ను వెస్ట్‌ జోన్‌, శాంతిభద్రతల అడిషన్‌ సీపీ డీఎస్‌ చౌహాన్‌ను సౌత్‌ జోన్‌కు, స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషిని సెంట్రల్‌ జోన్‌కు, సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మొహంతిని నార్త్‌ జోన్‌కు కేటాయించారు. ఉన్నతాధికారులు సంబంధిత డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో సమావేశమై క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా దిశానిర్దేశం చేస్తారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.