హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్స్ విభాగంలోని 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 11 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.