e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News టీ-సేవా కేంద్రాల ప్రారంభానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

టీ-సేవా కేంద్రాల ప్రారంభానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, జిల్లాలు, మండలాలు, పంచాయతీ ప్రాంతాలలో టీ-సేవా ఆన్‌లైన్ కేంద్రాలను ప్రారంభించడానికి ఆస‌క్తి గ‌ల‌ అభ్య‌ర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. టీ-సేవా సెంటర్ అనేది ఇంటర్నెట్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు లేని చాలా మందికి అందుబాటులో ఉన్న ఇ-సేవలు / ఆన్‌లైన్ సేవలను సులభతరం చేయడానికి ఉద్దేశించింద‌ని ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సేవా కేంద్రంలో పాన్ కార్డు నమోదు, త‌ప్పుల స‌వ‌ర‌ణ‌, ఆధార్‌తో అనుసంధాన‌మైన చెల్లింపులు, మైక్రో ఏటీఎం స‌ర్వీసులు, భారత్ బిల్ పేమెంట్స్‌, బస్సు, రైలు, విమాన టిక్కెట్ల బుకింగ్‌, బ్యాంక్ సీఎస్పీ, చెల్లింపులు, కొత్త ఖాతాల ప్రారంభం, డెబిట్ కార్డుల జారీ, నగదు డిపాజిట్లు, నగదు విత్ డ్రా, బీమా సేవలు, బంగారు రుణాలు, 20కి పైగా కంపెనీలకు నగదు సేవలు, అన్ని బ్యాంక్‌ల‌కు న‌గదు బదిలీలు, టెలికాం రీఛార్జీలు – ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్, డేటా కార్డులు, బీమా చెల్లింపులు, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆన్‌లైన్ అడ్మిష‌న్ స‌ర్వీసెస్ సేవ‌లు అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల ఔత్సాహికులు ఆగస్టు 12న లేదా అంతకన్నా ముందు www.tsevacentre.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం 81799 55744 నంబ‌ర్‌లో సంప్రదించవ‌చ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana