మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 06:34:53

స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని నిరుద్యోగులైన యువతి,యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగులు అర్హులన్నారు. దేవరయాంజల్‌లోని ఎస్సీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని బి బ్లాక్‌లో గల జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కార్యాలయంలో సంప్రందించాలని సూచించారు.


logo
>>>>>>