ఆదివారం 31 మే 2020
Telangana - May 22, 2020 , 06:47:13

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

హిమాయత్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ తేదీన నగరంలో నిర్వహించే తెలంగాణ రత్న పురస్కారాల ప్రదానోత్సవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్‌ డాక్టర్‌ ఇ.ఎస్‌.ఎస్‌ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 

కవులు,రచయితలు, సంగీత, నృత్య, రంగస్థల, యోగ, వైద్య, క్రీడాకారుల సేవలకు గాను పురస్కారం ప్రదానం చేసి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆసక్తిగలవారు 31వ తేదీ లోగా వారి ప్రతిభను తెలియజేసే సర్టిఫికెట్స్‌, వీడియో క్లిప్పింగ్స్‌ను సికింద్రాబాద్‌, గోకుల్‌ నగర్‌లలో ఉన్న తమ కార్యాలయంలో అందజేయాలని కోరా రు.వివరాలకు 9652347207ను సంప్రదించాలన్నారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo