హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ(టీఎస్ఎఫ్ఎస్ఎల్)లో సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అభిలాష బిస్త్ తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మొత్తం ఏడుగురు సైంటిఫిక్ అసిస్టెంట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను నేరుగా మాత్రమే(ఆన్లైన్లో అవకాశం లేదు) తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆదివారం వరకు తుది గడువు ఉన్నట్లు చెప్పారు. అదనపు వివరాలకు ‘www.tspolice.gov.in’లో లేదా 040-23326252, 040-23307138 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.