శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 08:06:41

ఆలయాల ట్రస్టీ షిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఆలయాల ట్రస్టీ షిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : దేవాదాయ, ధర్మాదాయ శాఖ  హైదరాబాద్‌ విభాగం పరిధిలోని ఏడు ఆలయాల ట్రస్టీషిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణారావు అబిడ్స్‌లోని తన కార్యాలయంలో గురువారం తెలిపారు. చట్టం 33/2007 ద్వారా సవరించబడిన విధంగా తెలంగాణ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌ 1987 (యాక్ట్‌ 30/1987)లోని సెక్షన్‌ 15లోని సబ్‌ సెక్షన్‌ (2) కింద వంశ పారంపర్యం కాని ట్రస్ట్‌ బోర్డు నెలకొల్పబడుతుందని, అందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. 

నగరంలోని ఆసిఫ్‌నగర్‌ మండలం, ముస్తయిద్‌ పురా పరిధిలోని శ్రీహనుమాన్‌ ఆలయం, ఇదే మండలంలోని ఆఘాపుర -న్యూ బోయిగూడలోని జై మహంకాళి ఆలయం, నాంపల్లి మండలం పరిధిలోని సత్తెన్న గల్లీ-శంకర్‌జీ హనుమాన్‌ జీ ఆలయం, బహదూర్‌పురా-శాలిబండ, రూప్‌లాల్‌ బజార్‌ పరిధిలోని శ్రీదీనానాథ్‌ ఆలయం, అంబర్‌పేట మండలం పరిధిలోని న్యూ నల్లకుంట- శ్రీ శివయ్య దుర్గా ఆలయం, ఇదే మండలంలోని తిలక్‌నగర్‌ శ్రీలక్ష్మీ గణపతి-మా తా దుర్గాదేవి ఆలయం, అంబర్‌పేట - శ్రీరామ్‌ మందిరంలలో ట్రస్టీ షిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణారావు తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo