అందుబాటులోకి కొత్త ఆప్షన్
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్థితిని తెలుసుకునేందుకు కొత్తగా మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. ‘ఈ-చలాన్/అప్లికేషన్ స్టేటస్’ పేరుతో ఉన్న ఈ మాడ్యూల్లో పది ఆప్షన్లు ఇచ్చారు. అందులో కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని, అప్లికేషన్/ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ ఎంటర్‌చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు అయితే ఏ అధికారి వద్ద ఉన్నదో, చలాన్ అయితే దాని స్థితి ఏమిటో వివరాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.