ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 08:17:40

టీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్‌ : టీ-సేవ ఆన్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు టీ సేవ సంస్థ డైరెక్టర్‌ అడపా వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం  కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆసక్తి గల యువతీయువకులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, వికలాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 8179955744, ఆన్‌లైన్‌లో www.tsevacentre.com లో సంప్రదించవచ్చన్నారు. 


logo