శనివారం 11 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:42:50

నేడు సీఎం వద్దకు యాపిల్‌రైతు

నేడు సీఎం వద్దకు యాపిల్‌రైతు

  • కేంద్రే బాలాజీకి సీఎం పేషీ నుంచి ఫోన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో తొలిసారి యాపిల్‌ పంట పండించిన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలం దనోరాకు చెందిన రైతు కేంద్రే బాలాజీ మంగళవారం సీఎం కే చంద్రశేఖర్‌   రావును కలువనున్నారు. సోమవారం రాత్రి ఆయనకు సీఎం పేషీనుంచి ఫోన్‌చేసి హైదరాబాద్‌కు రావాల్సిందిగా సూచించారు. ఈ మేరకు బాలాజీ తన యాపిల్‌ తోటలోని తొలిపంటను సీఎంకు అందజే సేందుకు బయలుదేరారు. ఇటీవల నియంత్రిత పంటల సాగుపై సమీక్ష సందర్భంగా కేంద్రే బాలాజీ చేస్తున్న యాపిల్‌ సాగు ప్రస్తావనకు రాగా.. అతడిని తన వద్దకు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.


logo