బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 01:57:06

అరుదైన కాలేయ మార్పిడి చికిత్స

అరుదైన కాలేయ మార్పిడి చికిత్స

  • మిస్‌ మ్యాచ్‌ బ్లడ్‌ గ్రూప్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విజయవంతం
  • అపోలో వైద్య బృందం ఘనత

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అపోలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశా రు. మిస్‌ మ్యాచ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా కాలేయ మార్పి డికి దాత, గ్రహీత ఒకేరక్తం గ్రూపు వారై ఉండాలి. కానీ, అపోలో వైద్యులు.. రెండు వేర్వేరు రక్త గ్రూపులు గల వ్యక్తుల మధ్య అరుదైన కాలేయ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. హెపాటిక్‌ హైడ్రోథొరాక్స్‌, బుడ్‌ చియారి -సిండ్రోమ్‌ కారణంగా అనారోగ్యం బారినపడ్డ వరంగల్‌కు చెందిన 19 ఏండ్ల సౌమ్యకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి వచ్చింది. అదే గ్రూపునకు చెందిన కాలేయం దాత కోసం మూడు నెలలపాటు ఎదురుచూశారు. 

చనిపోయిన వ్యక్తి కాలేయ అవయవం అందుబాటులోకి వస్తుందన్న ఆశ ఎంతమాత్రం లేకపోవటంతో అపోలో వైద్యులు.. మిస్‌ మ్యాచ్‌డ్‌ బ్లడ్‌ గ్రూప్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (ఏబీవో ఇన్‌కంపాటిబుల్‌ లివింగ్‌ డోనర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చేయించుకోవాలని బాధితురాలికి సూచించారు. ఇందుకోసం సౌమ్య తల్లి ముందుకురావటంతో.. ఆమె కాలేయంలో కొం తభాగాన్ని తీసి సౌమ్యకు ప్లాంటేషన్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ పూర్తయి నెల గడిచింది. సౌమ్య ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నదని ఆపరేషన్‌ బృందానికి నేతృత్వం వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మనీష్‌ వర్మ శనివారం మీడియాకు తెలిపారు. ప్రపంచంలో అరుదుగా ఇలాంటి ఆపరేషన్లు జరుగుతాయని పేర్కొన్నారు.logo