శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 18:20:30

జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధం

జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధం

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధమైంది. త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం అందించారు. సమావేశం అజెండా కోసం అంశాలు పంపాలని కేంద్రం రాష్ర్టాలను కోరింది. 

పోతిరెడ్డిపాడు వివాదం నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోతిరెడ్డిపాడు పథకంపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేసింది. పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరంపై కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో అపెక్స్‌ మీటింగ్‌కు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆరేళ్లలో ఒకే ఒక్కసారి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. 2015లో కేసీఆర్‌, చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.  


logo