సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:45

అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌

అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌

  • కొనియాడిన చినజీయర్‌ స్వామి

సిరిసిల్ల: సాగునీటిని కాలువల ద్వారా పంట భూములకు మళ్లిం చి సీఎం కేసీఆర్‌ అపరభగీరథుడయ్యాడని శ్రీ తిదండి చిన జీయర్‌స్వామి కొనియాడారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌లో చిరుధాన్యాల ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు భూమిపూజ చేశారు. అనంతరం చిన జీయర్‌స్వామి మాట్లాడుతూ.. ‘ఒక వ్యక్తి చేసిన కృషి, ఆలోచన చక్కటి నీటివనరులు కలిగే శక్తిని ఇచ్చింది. మంత్రం వేసి నీటిని మళ్లించలేదు. సహజ సిద్ధంగా వచ్చిన నీటిని కాలువల ద్వారా భూములకు మళ్లించి మార్పు తెచ్చి అపరభగీరథ ప్రయత్నం చేశాడు సీఎం కేసీఆర్‌' అని అన్నారు. ప్రపంచీకరణతో మానవాళి సహజత్వాన్ని కోల్పోయిందని, రసాయనాలతో మిళితమైన ఆహారానికి అలవాటుపడి మనిషి అనారోగ్యానికి దగ్గరవుతున్నాడన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ తన్నీరు రంగారావు, టెస్కాబ్‌ అధ్యక్షుడు కే రవీందర్‌రావు పాల్గొన్నారు.