సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:58:44

అమెరికాలో ఏపీ యువతి దుర్మరణం

అమెరికాలో ఏపీ యువతి దుర్మరణం

హైదరాబాద్‌: అమెరికాలోని బాల్డ్‌ జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలవరపు కమల అనే యువతి ప్రమాదవశాత్తూ అందులో జారిపడి చనిపోయారు. కృష్ణా జిల్లాకు చెందిన కమల కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. తనకు కాబోయే భర్తతో కలిసి శనివారం అట్లాంటాలోని తమ  బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగివస్తున్న క్రమంలో బాల్డ్‌ జలపాతం వద్ద ఆగారు. అక్కడ ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకునే క్రమంలో జారి ఇద్దరూ జలపాతంలో పడిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది రక్షించడానికి ప్రయత్నించినా కమలను కాపాడలేకపోయారు. 


logo