గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 16:28:49

ఆటో, టాక్సీ డ్రైవర్లకు నగదు జమ

ఆటో, టాక్సీ డ్రైవర్లకు నగదు జమ

అమరావతి: సొంతంగా ఆటో,టాక్సీ, మాక్యీ క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ల ఖాతాలో ఏపీ ప్రభుత్వం  నగదును జమ చేసింది. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఈమేరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10వేల చొప్పున జమ చేసే కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ నేడు క్యాంపు కార్యాలయంలో  ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,62,493 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రెండో విడతగా రూ.262.49 కోట్లను జమ చేశారు. 10న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు, 17న చేనేత కార్మికులకు, 24న కాపులకు సహాయం చేయనున్నామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ తెలిపారు. 


logo