శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:17:00

ఏపీ నిర్ణయం ఏకపక్షం

ఏపీ నిర్ణయం ఏకపక్షం

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ  

ఖమ్మం: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపా డు వద్ద కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టడం అభ్యంతరకరమనీ, దానిని అడ్డుకుని తీరుతామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టంచేశారు. బుధవారం ఖమ్మంలోని క్యాం ప్‌ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఏపీ ఏకపక్ష నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దమని అన్నారు. తెలంగాణను సంప్రదించకుండా, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఏపీ తీరుతో ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్‌ కమల్‌రాజు, ఎమ్మెల్యే రాములునాయక్‌ పాల్గొన్నారు.logo