ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:20

కరోనాతో ఏపీ మాజీ మంత్రి కన్నుమూత

కరోనాతో ఏపీ మాజీ మంత్రి కన్నుమూత

  • l చికిత్స పొందుతూ మాణిక్యాలరావు తుదిశ్వాస
  • l ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (59) కన్నుమూశారు. కొద్దిరోజులుగా కొవిడ్‌ చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. 20 రోజుల కిందట ఏలూరు కొవిడ్‌ దవాఖానలో చేరిన ఆయనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాణిక్యాలరావు 2014-18 మధ్యకాలంలో ఏపీ దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. మాణిక్యాలరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు.logo