Telangana
- Nov 27, 2020 , 01:35:53
మంజీరా నదిలో ఏఓ ఆత్మహత్య!

నాగల్గిద్ద/మనూరు: సంగారెడ్డి జిల్లా మనూరు మం డలం రాయిపల్లి శివారులోని మంజీరా నదిలో మండల వ్యవసాయ శాఖ అధికారి గల్లంతయ్యారు. నారాయణఖేడ్ మండలం పైడిపల్లికి చెందిన అరుణ(32) సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాధికారిగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆమె కారు రాయిపల్లి మంజీరా వంతెనపై నిలిపి ఉండటం, అందులో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన పలువురు మనూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా కారులో అరుణ సెల్ఫోన్, పర్సు, కారు తాళం చెవి లభించాయి. అరుణ బ్రిడ్జిపై కారు నిలిపి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నదిలో గాలింపు చర్యలు చేపట్టగా ఇంకా ఆచూకీ లభించలేదు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING